తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాఫిక్​ పార్కుకు వెళ్లారా..?

వేగం కన్న ప్రాణం మిన్న.. అతి వేగం ప్రమాదకరం.. ఇలా ట్రాఫిక్​ నిబంధనలన్నీ మనకు తెలుసు... కానీ ఎంత మంది పాటిస్తున్నారు. ఇలా నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాల్లో వేల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా హత్యలు, ఇతర నేరాల్లో మృతి చెందుతున్న వారి కంటే రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో దుర్మరణం చెందుతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం ఇందుకు ప్రధాన కారణం.  ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావించిన తెలంగాణ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

ట్రాఫిక్​ పార్కుకు వెళ్లారా..?

By

Published : Nov 20, 2019, 6:45 AM IST

ట్రాఫిక్​ పార్కుకు వెళ్లారా..?

రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కారణం ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడమే. ఇటీవల కేంద్ర ఉపరితల రవాణ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే.. చిన్నారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై మరింత అవగాహన కలిగించడానికి శ్రీకారం చుట్టారు. నాగోల్‌లో చిన్నారుల ట్రాఫిక్‌ పార్కు అందుబాటులోకి తెచ్చారు.

ట్రాఫిక్​పై అవగాహన

రహదారులపై వాహనాలు ఏ విధంగా నడపాలి, నిబంధనలు ఎలా పాటించాలి తదితర అంశాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ పార్కును అదనపు డీజీ జితేందర్‌ ప్రారంభించారు. ఈ పార్కును హీరో సంస్థ సౌజన్యంతో రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారు.

విద్యార్థి దశ నుంచే

రహదారులను సురక్షితంగా మార్చడానికి ప్రతీ ఒక్కరు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యార్థులు చెప్పారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్​తో పాటు నిబంధనలు పాటించని వారిపై తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.

జిల్లాలో కూడా

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు చేపడుతున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు. అన్ని జిల్లాలో కూడా ట్రాఫిక్​ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details