Traffic Restrictions In Hyderabad City: ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాలు, ఫార్ములా-ఈ- రేస్ పనుల కారణంగా అసెంబ్లీ, ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనాదారులు ఈ ప్రదేశాల వైపు రాకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు వాహనదారులను కోరారు. అందుకు తగిన ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు చేశారు.
ట్రాఫిక్‌ను ఏఏ మార్గాల్లో మళ్లించనున్నారు:
1. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి నెక్లస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించమని సృష్టంచేశారు. వాహనాదారులను ఖైరతాబాద్ షాదన్ కళాశాల వైపు మళ్లిస్తారు.
2. బుద్ధ భవన్/ నల్లగట్టు జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అనుమతించారు. నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ /ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
3. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి వైపు అనుమతించారు. తెలుగుతల్లి స్టార్టింగ్ ఫ్లై ఓవర్ వద్ద కట్ట మైసమ్మ/ లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
4. తెలుగు తల్లి నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అనుమతించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
5. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
6. ఖైరతాబాద్ పెద్ద గణేశ్ రహదారి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను పెద్ద గణేశ్ వద్ద రాజ్ దూత్ లేన్ వైపు మళ్లిస్తారు.
7. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ ,లుంబినీ పార్క్ ఫార్ములా ఈ-రేసింగ్ ప్రిపరేటరీ సివిల్ పనులు జరుగుతున్న సమయంలో అలాగే రేస్ జరిగే రోజులలో మూసివేయబడతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
శాసనసభ, మండలి సమావేశాల నేపథ్యంలో భద్రతాపరంగా పోలీస్‌శాఖ లోపల, బయట భారీగా పోలీసులను మొహరించింది. పోలీసు శాఖ ఇందుకు అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేసింది. సమావేశాల సందర్భంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉండడంతో.. అసెంబ్లీ లోనికి చొచ్చుకుని రాకుండా ఉండేందుకు ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 5 నుంచి పూర్తిస్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి: