తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రివర్గ సమావేశం పేదలకోసం కాదు.. లిక్కర్ కోసం: రేవంత్

మంత్రిమండలి పేరిట 7 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ పేద ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేవలం లిక్కర్ కోసమే చర్చించి దాన్ని అమలు చేశారని రేవంత్ దుయ్యబట్టారు.

మంత్రివర్గ సమావేశం పేదలకోసం కాదు... లిక్కర్ కోసం
మంత్రివర్గ సమావేశం పేదలకోసం కాదు... లిక్కర్ కోసం

By

Published : May 6, 2020, 9:18 PM IST

నిత్యావసర ధరలు పెంచితే పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... లిక్కర్​పై రేట్లు పెంచిన కారణంగా ఆయనపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న ఏడు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్ణయం కూడా సీఎం కేసీఆర్ తీసుకోలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. కేవలం లిక్కర్ రేట్లు పెంచేందుకే ఏడు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారని ఆయన విమర్శించారు.

సుమారు 4500 మందికి సరుకులు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రేవంత్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 4,500 మందికి నిత్యవసర వస్తువులు ఎంపీ రేవంత్ పంపిణీ చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు, వలస కార్మికులకు, పేదలకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదని ఆయన మండిపడ్డారు.

పేదలకు ఆర్థిక సహాయం చేయాలని భావించినప్పటికీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దుయ్యబట్టారు. ఇంటి అద్దె కట్టొద్దు అని చెప్తున్న కేసీఆర్, ఇంటి యాజమానులకు ఇంటి పన్నును ఎందుకు రద్దుచేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు మాని పేదల శ్రేయస్సు కోసం కృషి చేయాలని రేవంత్ హితవు పలికారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ABOUT THE AUTHOR

...view details