గాంధీభవన్‌లో కరోనా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు 040-24601254 నంబర్‌కు కాల్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8గంటలకు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో కరోనా కంట్రోల్ రూమ్ - గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కరోనా కట్టడికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్క ఫోన్ చేస్తే కాంగ్రెస్ శ్రేణులు అందుబాటులోకి వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Establishment of Corona Control Room in Gandhibhavan
కరోనా బాధితులు ఫోన్ చేస్తే వారి అవసరాలను బట్టి కాంగ్రెస్ నేతలు ఆయా ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. కంట్రోల్ రూం బాధ్యులుగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌లాల్ ఉంటారని ఉత్తమ్ తెలిపారు.