revanth reddy tweet : నూతన సంవత్సంర సందర్భంగా వైన్‌షాపులు, బార్లు సమయం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒమిక్రాన్, కొవిడ్ కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుంటే.. తెలంగాణలో మద్యం దుకాణాల సమయం పొడింగించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం హోటళ్ల సమయాలను పొడిగించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా.. అని ప్రశ్నించారు.
revanth reddy tweet : ఆ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి
revanth reddy tweet : నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం హోటళ్ల సమయాలను పొడిగించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో... అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుంటే.... తెలంగాణలో మద్యం అమ్మకాల కోసం మరింత సమయం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
tpcc president revanth reddy
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను టాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఒంటి గంటవరకు బార్లకు, అర్ధరాత్రి 12 వరకు వైన్స్ దుకాణాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు.
ఇదీ చూడండి :Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు