తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2021, 3:37 PM IST

ETV Bharat / state

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్​

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు పార్టీ అభ్యర్థులకు ఉత్తమ్.. గాంధీభవన్​లో​ బీ ఫారాలు అందజేశారు.

uttham kumar reddy
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

నిరుద్యోగ భృతి పేరుతో యువతను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ ‌రెడ్డి ఆరోపించారు. లక్షా 91 వేల ఉద్యోగులు భర్తీ చేస్తూనే.. నిరుద్యోగులకు రెండేళ్లుగా ఇవ్వాల్సిన భృతిని చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఓడిస్తేనే..

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓడినందునే ప్రభుత్వం.. 50 వేల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ప్రకటించిందని ఉత్తమ్​ విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్​.. నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. పట్టభద్రుల, సాగర్​ ఉప ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే రూ. 3016 భృతి తప్పనిసరిగా వస్తుందని వెల్లడించారు. ముందు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించిన తర్వాతనే ప్రజలను కేసీఆర్​ ఓట్లు అడగాలని హితవు పలికారు.

రాష్ట్రానికి భాజపా అన్యాయం చేస్తోంది

రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు.. చిన్నారెడ్డి, రాములు నాయక్‌కు గాంధీ భవన్​లో ఉత్తమ్​ బీ ఫారాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన హామీలను భాజపా ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని ఉత్తమ్​ ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను తీసుకు రావడంలో బండి సంజయ్‌ విఫలం చెందారని విమర్శించారు. అయోధ్య రామమందిరానికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, తెరాసను చిత్తుగా ఓడించాలని సూచించారు.

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్​

ఇదీ చదవండి:దుబ్బాక రైతు వేదిక ప్రారంభోత్సవంలో రసాభాస

ABOUT THE AUTHOR

...view details