విద్యార్థుల జీవితాలతో దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఆడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలను కూడా వాయిదా వేయాలన్నారు. గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన దీక్షను ఉత్తమ్‌కుమార్ రెడ్డి సందర్శించి మాట్లాడారు.
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలి: ఉత్తమ్ - corona virus
కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. కొవిడ్ సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని శుక్రవారం ఉదయం 11గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆయకర్ భవన్ వద్ద కూడా ఆందోళన చేస్తామన్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టు చేస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేయాలన్నారు.
ఇవీ చూడండి: ఎంపిక చేసిన గ్రామాల్లో... ఐసీఎంఆర్ నమూనాల సేకరణ