తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాం: ఉత్తమ్ - CONGRESS LEADERS FIRE ON CM KCR

తెరాస, భాజపాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ధ్వజమెత్తారు. ఇక నుంచి రాష్ట్రంలో తెరాస, భాజపాలతో వేదిక కూడా పంచుకోబోమని ఉద్ఘాటించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజలను తెరాస మోసం చేస్తోందని ఉత్తమ్​ మండిపడ్డారు. అనుమతి ఇవ్వకపోయినా 'సేవ్​ నేషన్​... సేవ్​ కాన్సిటిట్యూషన్'​ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

TPCC CHIEF UTTAM KUMAR REDDY FIRE ON CM KCR ABOUT CAA, NRC ACT
TPCC CHIEF UTTAM KUMAR REDDY FIRE ON CM KCR ABOUT CAA, NRC ACT

By

Published : Dec 26, 2019, 5:05 PM IST

రాష్ట్రంలో ఇక నుంచి తెరాస, భాజపాలతో కాంగ్రెస్​పార్టీ వేదిక పంచుకోబోదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. తెరాస అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. రాహుల్, సోనియా నాయకత్వంలో సీఎఎ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు. సెక్యులర్‌ దేశం కోసం కాంగ్రెస్​ పార్టీ పోరాడుతున్నట్లు వెల్లడించారు. మతతత్వ పార్టీలతో కలిసి పనిచేస్తున్న తెరాస... సీఏఏపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లబ్ది కోసం రాజకీయం చేయదని, రోజుకొక మాట మాట్లాడదన్నారు ఉత్తమ్​. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా "సేవ్‌ నేషన్‌..సేవ్‌ కాన్సిటిట్యూషన్" పేరుతో.... 28న కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

'తెరాస, భాజపాలతో వేదిక కూడా పంచుకోము'

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details