కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి Revanth Reddy Fires on KCR: సీఎం కేసీఆర్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిల్లీలో ఆరోపించారు. తూతూమంత్రంగా తెరాస ఎంపీల నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తప్పు ఉంటే కేసీఆర్ దిల్లీ ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచుతానన్న కేసీఆర్... ఫామ్‌హౌస్‌లో పడుకున్నారా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో బియ్యం నిల్వల అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేద్దామని నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. కానీ అపాయింట్మెంట్ లభించడం లేదు. రైతుల పక్షాన పోరాటంలో భాగంగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగుతాం. పసుపు బోర్డు ఏర్పాటు సహా.. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలి. పార్లమెంట్లో తెరాస ఎంపీల నిరసనలు తూతూమంత్రంగా ఉన్నాయి. కేంద్రం తప్పు ఉంటే కేసీఆర్ దిల్లీకి ఎందుకు రావట్లేదు. రైసు మిల్లర్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 32 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
- రేవంత్ రెడ్డి, టీసీసీసీ అధ్యక్షుడు
రైసు మిల్లర్ల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం బందీ
Revanth Reddy allegations: తెరాస ఎంపీలు 10 నిమిషాలు నిరసన తెలిపి సెంట్రల్ హాల్‌లో సేద తీరుతున్నారని అభిప్రాయపడ్డారు. రైసు మిల్లర్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రైసు మిల్లర్ల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం బందీగా ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు కేవలం 32 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు లెక్కలు చూపించుకుంటున్నారని స్పష్టంచేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఎంత ధాన్యం కొన్నారో స్పష్టం చేయాలన్నారు. రాజ్యసభలో తెరాస సభ్యులు హడావిడి చేస్తే.. పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. కేంద్రంతో ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా సరఫరా చేయలేదన్నారు.
ఇదీ చూడండి:
TRS MPs walkout from Lok Sabha: లోక్‌సభలో యాసంగిలో ధాన్యం సేకరణపై తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస ఎంపీలు నినాదాలు చేశారు. తెరాస ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. కేంద్రం తీరుకు నిరసనగా లోక్‌సభ నుంచి తెరాస వాకౌట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.