తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth reddy comments on KCR : 'సీఎం కేసీఆర్‌ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి' - తెలంగాణ ప్రధాన వార్తలు

Revanth reddy comments on KCR: భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​పై దేశ ద్రోహం కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. కేసీఆర్‌ను శిక్షించే వరకు న్యాయపోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.

Revanth reddy comments on KCR, revanth police complaint on kcr
కేసీఆర్​పై ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

By

Published : Feb 5, 2022, 3:23 PM IST

Revanth reddy comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్న రేవంత్‌.. దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. కేసీఆర్‌ను శిక్షించే వరకు న్యాయపోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.

పోలీసులు రాజకీయ పెద్దలకు లొంగకుండా... నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్​పై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుగు వేస్తే... వారిపై న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలి. రాజకీయ పెద్దలకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కేసీఆర్​పై కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసేంతవరకు పోరాటం చేస్తాం. కేసీఆర్ భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. 8 ఏళ్ల కాలంలో భాజపాకు కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందించారు. ఇప్పుడు కేసీఆరే తిట్టడమంటే ఒప్పందాల్లో తేడా రావడమే.

-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్

కేసీఆర్​పై ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

ఇదీ చదవండి:మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details