తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థులు వీరే.. - కాంగ్రెస్​ నేత ఉత్తమ్​కుమార్​

త్వరలో జరగబోయే పరిషత్​ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆరు జిల్లా పరిషత్​లకు ఛైర్మన్​ అభ్యర్థులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు.

ఉత్తమ్​కుమార్​ రెడ్డి

By

Published : May 1, 2019, 11:52 PM IST

ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేని కాంగ్రెస్​... స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా అగ్రస్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే తాజాగా ఆరు జడ్పీ స్థానాలకు ఛైర్మన్​ అభ్యర్థులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు. త్వరలో ఏకాభిప్రాయంతో మిగతా జిల్లాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు.

జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థుల వివరాలు....

ఆదిలాబాద్ -చారులత రాథోడ్
మహబూబాబాద్ -ఇస్లావత్ పార్వతి
మహబూబ్‌నగర్ -దుష్యంత్ రెడ్డి
మంచిర్యాల -మద్ది రమాదేవి
నల్గొండ -కోమటిరెడ్డి మోహన్ రెడ్డి
నాగర్‌కర్నూల్ -అనురాధ వంశీకృష్ణ

ఇదీ చదవండి : 'ఎన్నికల శాతాలు ప్రకటించడంలో ఈసీ పూర్తిగా విఫలం'

ABOUT THE AUTHOR

...view details