Tourism Expo in Hitex: పర్యాటక రంగానికి నూతనోత్తేజం కల్పించేందుకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ వేదికగా నిలిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన టూరిజం రంగానికి ఆదరణ తెచ్చేందుకు నిర్వహిస్తున్న ఎక్స్పో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
పాల్గొంటున్న 20 రాష్ట్రాలు
Tourism expo in hyderabad: ఈ టూరిజం ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 20 రాష్ట్రాల నుంచి టూరిజం శాఖలు, ప్రైవేట్ ప్లేయర్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆ నగరాల్లోని ప్రముఖ హోటళ్లు ఇక్కడ స్టాళ్లను నెలకొల్పారు. ఈ ఎక్స్పో ద్వారా తమ తమ రాష్ట్రాల్లోని బెస్ట్ టూరిజం డెస్టినేషన్లు, తాము అందిస్తోన్న ఆకర్షణీయమైన ప్యాకేజీల సమాచారాన్ని పర్యాటక ఔత్సాహికులకు వివరిస్తున్నారు.
రామప్ప ఆలయ ప్రదర్శన
Telangana tourism:తెలంగాణలో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. నగరంలో ప్రముఖమైన రామోజీ ఫిల్మ్ సిటీ, చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కోండ కోట, వరంగల్‌లోని లక్నవరం లాంటి అందమైన పర్యాట ప్రదేశాల ఫోటోలు ఎక్స్‌పోలో ప్రదర్శించారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం సమాచారం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు ఈ టూరిజం ఎక్స్పోను రాష్ట్రమంత్రి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Tourism packages pan india: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యాటకానికి ద్వారాలు తెరుచుకున్నందున పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, అడ్వెంచర్ ట్రిప్పులు ఆఫర్ చేస్తూ పర్యాటక బోర్డులు, సంస్థలు పోటీ పడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
పాండమిక్ తర్వాత హాలిడేస్‌కు వెళ్లాలి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత రిలీఫ్ కోరుకుంటున్నారు. మనదేశంలో చాలా టూరిజం డెస్టినేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలో చాలా చూడాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో రామప్ప ఆలయం ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాల సమాచారం కూడా ఉంది. ప్రధానంగా కశ్మీర్, హిమాచల్ ప్రాంతాలకు ప్యాకేజీలు ఉన్నాయి. వారణాసి, అయోధ్య, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, నాగ్‌పూర్, వైల్డ్ లైఫ్ ఏరియాస్ లాంటి సమాచారం ఇక్కడ లభిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే టూరిజం కోలుకుంటోంది. మేజర్ డెస్టినేషన్స్‌కు సంబంధించిన హోటల్స్, ప్యాకేజీల సమాచారం మొత్తం ఇక్కడ లభిస్తుంది. ఈ ఎక్స్పో 20 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి.
- రోహిత్ హన్గల్, డైరెక్టర్, ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్
హైటెక్స్‌లో ప్రారంభమైన టూరిజం ఎక్స్పో ఇవీ చూడండి: