తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM

By

Published : Jul 10, 2020, 4:59 PM IST

Updated : Jul 10, 2020, 5:26 PM IST

1.ప్రభుత్వం హైకోర్టును తప్పుదోవ పట్టించింది : రేవంత్​రెడ్డి

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. ఆయన మత విశ్వాసాలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించారు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న సమయంలో.. సచివాలయ కూల్చివేత నిర్ణయం సరైంది కాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

సచివాలయ ప్రాంగణంలోని మసీదు, దేవాలయాల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.సచివాలయం కూల్చివేత చారిత్రక తప్పిదం: నారాయణ

ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం కూల్చివేత పేరుతో 6వ నిజాం నిర్మించిన కట్టడాలను కూల్చడం చరిత్రాత్మక తప్పిదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.సీఐసీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

సీఐసీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు అధికారిక వెబ్​సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.కరోనాపై దిల్లీ పోరు.. వేగంగా కోలుకుంటున్న బాధితులు

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తిని క్రమక్రమంగా కట్టడి చేస్తున్నారు. కేసుల సంఖ్య ఇటీవలే లక్ష దాటింది. కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగడం, కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.లాభాల స్వీకరణతో వారాంతంలో నష్టాలు

స్టాక్​ మార్కెట్లు వారంలో చివరి సెషన్​ను నష్టాలతో ముగించాయి. బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.చైనాకు డబ్ల్యూహెచ్​ఓ బృందం.. 2 రోజులు అక్కడే

డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటించనుంది. ఆ దేశంతో జనవరిలో కుదిరిన ఒప్పందం మేరకు వుహాన్​లో వైరస్ ఉత్పన్నం కావడానికి గల కారణాలపై పరిశోధించనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.'ప్రపంచకప్​లో భారత్​ ఓడిపోవడానికి కారణమదే!'

జట్టులోని అనిశ్చితి కారణంగా 2019 ప్రపంచకప్​ నుంచి భారత్ వెనుదిరిగిందని అభిప్రాయపడ్డాడు మాజీ కోచ్​ టామ్​ మూడీ. జట్టులో బలమైన ఆటగాళ్లున్నా.. ప్రణాళికల్లో మార్పుల వల్ల ట్రోఫీని చేజార్చుకున్నారని తెలిపాడు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.ప్రముఖ​ సీరియల్​ నటిపై అత్యాచారం

తనపై అత్యాచారం జరిగిందని జాదవ్​పూర్​ పోలీసులను ఆశ్రయించింది ఓ బంగాల్​ నటి. పరిచయమున్న యువకుడే ఈ నెల 8న తనపై అత్యాచారం చేశాడని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

Last Updated : Jul 10, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details