కరోనాపై కీలక నిర్ణయం
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయన ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే!
ఎమ్మెల్యేకు కరోనా
తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా బారినపడ్డారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి.
భాజపా ఆందోళనలు
హైదరాబాద్ నగరంలోని విద్యుత్ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీళ్లు మాత్రమే పాల్గొనాలంటా! వారెవరంటే!
కాంగ్రెస్ రావాల్సిందే..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన ఉద్దేశాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారంటే!
కోలుకుంటున్న అచ్చెన్న
ఏపీలోని గుంటూరులో జీజీహెచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. గాయం నుంచి ఆయన కోలుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి కథనం.
త్రిముఖ వ్యూహం
దేశ రాజధాని దిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్, మేయర్లతో ఒక్కరోజే రెండు సార్లు సమావేశమయ్యారు కేంద్ర హొంమంత్రి అమిత్ షా. త్రిముఖ వ్యూహం గురించి మీరూ తెలుసుకోండి.
నవంబర్‌లో ఉగ్రరూపం..
నవంబరు మధ్య నాటికి భారత్‌లో కరోనా పరిస్థితి అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వెంటిలేటర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని తేలింది. ఆ సర్వే వివరాలు మీకోసం.
ట్రంప్ 'ర్యాంప్ వాక్'!
ఆయన రూటే సేపరేటు. ఆయన ఏం చేసినా అది ఓ వార్తే. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన ర్యాంప్‌పై నడిచిన విధానం అందరినీ ఆకర్షించింది. ఆ ర్యాంప్ వాక్‌ను మీరూ చూడండి.
ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి గురించి ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్టును మీరూ చదివేయండి.
ఆ రెండింటిపై రోహిత్ ఆసక్తి
లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ రెండింట్లో ఏ టోర్నీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్న అభిమానుల ప్రశ్నకు.. రెండింట్లోనూ అడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. అభిమానుల ప్రశ్నలు హిట్ మ్యాన్ సమాధానం కోసం క్లిక్ చేయండి.