తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

Topten news@9PM
టాప్​టెన్ న్యూస్​@9PM

By

Published : Jun 13, 2020, 9:00 PM IST

కరోనాపై ప్రధాని సమీక్ష

దేశంలో కరోనా తీవ్రత, తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమీక్షలో ఏయే అంశాలపై చర్చించారో తెలుసుకోండి.

డిక్టేటర్​ పాలన

ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని కేసీఆర్​ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. త్వరలోనే సీఎం ముసుగు తొలగడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిపై భట్టి కమెంట్స్​ కోసం క్లిక్​ చేయండి.

జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమం పట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే!

గ్రీన్ ఫ్రైడే

ప్రజల విస్తృత భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంత్రి వ్యాఖ్యల కోసం క్లిక్ చేయండి.

ప్రారంభించండి

కొవిడ్-19 చికిత్స కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొవిడ్​ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి ఈటల రాజేందర్​కు వినతిపత్రం అందజేశారు. మంత్రికి చాడ చెప్పిన సంగతులేంటి?

ఫాస్ట్​ఫుడ్​కు దెబ్బ

కరోనా మహమ్మారి పలు రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఏ టైంలో అయినా.. ఫుడ్ ఇండస్ట్రీకి డోకా ఉండదనుకుంటారు. ఫాస్ట్​ఫుడ్ వ్యాపారుల పరిస్థితిపై కథనం.

ఒకే సరిహద్దు- ఒకే సైన్యం

భారత్​- చైనా వివాదం పరిష్కారం కోసం రెండు దేశాలు కలిసి సరిహద్దు నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్​ హుడా. ఆయన సూచనలను మీరూ చదివేయండి.

మ్యాప్ ఆమోదం

భారత్‌ భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మరి భారత్ వైఖరేంటి?

కన్న కొడుకుపై కేసు

మలయాళీ నటి మాల పార్వతి తన కుమారుడు అనంత్​ కృష్ణన్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఎందుకు పెట్టిందంటే!

అలాంటిదేం లేదు

వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ ఐపీఎల్​లో ఆడేటప్పుడు జాతివివక్షను ఎదుర్కొన్నానని ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు అప్పటి సన్​రైజర్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. బరోడా పేసర్​ ఇంకా ఏమన్నాడంటే!

ABOUT THE AUTHOR

...view details