తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​ @ 3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

By

Published : Jun 14, 2020, 3:01 PM IST

Topten news@3PM
టాప్​టెన్ న్యూస్​@3PM

ధోని ఫేం ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 'ధోనీ' సినిమాలో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

దాడులు అరికట్టాలి

రాష్ట్రంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను వైద్య సంఘాల ప్రతినిధులు కోరారు. వైద్యులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి కథనం

ట్విస్ట్

ఒకరిని ప్రేమించింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించింది. పెళ్లీ చేసుకుంది. ఇంతలో అక్కడికి తాను ప్రేమించిన యువకుడు వచ్చాడు.తర్వాత ఏమైందంటే..

సచివాలయంలో కరోనా

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్​ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఆసుపత్రికి వెళ్తే.. చంపేశారు'..

సికింద్రాబాద్​ ఓల్డ్​ అల్వాల్​లోని ఎక్సెల్​ ఆసుపత్రిలో కడుపు నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న మూడ్రోజుల అనంతరం ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడని ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆ 90 మందికి..

ఆ 90మంది వైద్యులకు కరోనాచెన్నైలోని రాజీవ్​ గాందీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. అయితే వీరిలో వైరస్​ రోగులకు చికిత్స అందించినవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కట్టడి వ్యూహం

కట్టడి వ్యూహంకేంద్ర హోంమంత్రి అమిత్​షా.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్​, ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో సమావేశమయ్యారు. దేశ రాజధానిలో ఉద్ధృతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఈ మహమ్మారి కట్టడిపై చర్చించిన అంశాలివే..

లావా లావా..

అగ్నిపర్వతం.. విస్ఫోటం చెందితే ఎర్రటి అగ్నిగోళంలా ఉంటుంది. దాన్నుంచి మండుతున్న లావా దారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఓ అగ్ని పర్వతం మాత్రం నేను చాలా విభిన్నం అంటోంది. నీలం రంగులోనే కనిపిస్తానని చెప్తోంది. ఆ విశేషాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.

పూర్తిగా మార్చింది

తనపై నిషేధం, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చిందని అన్నాడు స్టార్ క్రికెటర్​ కేఎల్​ రాహుల్​. ఇదే ఆటలో నిలకడ తెచ్చిందని చెప్పుకొచ్చాడు. సహచర బ్యాట్స్​మన్ రోహిత్ శర్మపైనా ప్రశంసలు కురిపించాడు. ఇంకా ఏమన్నాడంటే!

మనదేశం కాదు

బాలీవుడ్​లోని కొందరు నటులకు భారత పౌరసత్వం లేదు. అయినా సరే ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం. అలాంటి వారిలో ఐదుగురు గురించిన విశేషాలు మీకోసం.

ABOUT THE AUTHOR

...view details