1. మంత్రి కొప్పులకు కొవిడ్ పాజిటివ్
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం ఆయన సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్ సోకింది. దీంతో మంత్రి కొప్పుల హోం క్వారంటైన్లోకి వెళ్లారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.మోసపోతావు మహాజన్.!
ప్రజల కరోనా కష్టాలు సైబర్ నేరగాళ్లకు వరంలా మారాయి. వాక్సిన్ మొదలు అవసరమైన సేవలన్నీ అందిస్తామంటూ సైబర్ వల విసురుతున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడా పడకలు దొరక్క, ఆక్సిజన్ అందుబాటులో లేక అల్లాడుతున్న వారి అవసరాన్నే తమ ఆయుధంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అసోం సీఎంగా హిమంత
అసోం రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పీఠం హిమంత బిశ్వను వరించింది. ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఠాగూర్, గోఖలే జయంతి- మోదీ నివాళులు
రవీంద్రనాథ్ ఠాగూర్ 160 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గోపాల కృష్ణ గోఖలే, మహారాణా ప్రతాప్లకూ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొవిడ్ వార్డులో నర్సు స్టెప్పులు
కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఓ నర్సు అదిరేటి స్టెప్పులేశారు. పీపీఈ కిట్ ధరించిన అజిత్ కుమార్ పట్నాయక్.. తీన్మార్ డ్యాన్స్‌తో వార్డులోని రోగులను అలరించారు. తనతోపాటు తోటి సిబ్బందితోనూ స్టెప్పులేయించారు. వీరి డ్యాన్స్‌ను చూసి వార్డులోని రోగులంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.