1. సీఎం ఆకాంక్ష
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ప్రసిద్ధి గాంచిన ఉగాది శుభాలు కలుగజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రైతులకు అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లాస్ట్ వార్నింగ్
వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్... భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్... ఇదే చివరి హెచ్చరిక అని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రసవత్తరంగా..
విమర్శలు, ప్రతివిమర్శలతో నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం కాక రేపుతోంది. మండే ఎండల్లోనూ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ... గ్రామాగ్రామాన తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా.. ఓట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పోడు భూముల విషయంలో కొంత కాలంగా అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య తలెత్తిన వివాదాలు చినికి చినికి గాలివానగా మారాయి. అటవీభూముల్లో ఆదివాసులు పోడుకొట్టి సాగు చేసుకుంటున్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఘర్షణలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎండా వానా..!
దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే.. ఈ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవచ్చని తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.