1. కట్టడి చర్యలు
ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడికి వైద్యారోగ్య శాఖ కొత్త యాప్‌ను రూపొందించిందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పీహెచ్సీ స్థాయి వరకు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల.. కాంటాక్ట్‌లకు వెంటనే సమాచారం పంపేలా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కొత్తగా నమోదు వద్దు
కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల నూతన రిజిష్ట్రేషన్లకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో నిబంధనలకు విరుద్ధంగా అనర్హులు టీకాలు పొందుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కదులుతున్న డొంక
సంచలనం సృష్టించిన కర్ణాటక మత్తుమందుల కేసు.. తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై ఆరోపణలు వస్తుండడం.. వీరికి సినీ ప్రముఖులతో సంబంధాల ఉండడంపై కర్ణాటక పోలీసులు.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.అలైన్‌మెంట్‌లో మార్పులు!
ప్రాంతీయ రింగు రోడ్డు అమరికలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆరు జిల్లాల నుంచి ఈ మార్గం వెళ్లనుంది. గడిచిన కొన్నేళ్లలో పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంతీయ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌కు అడ్డంకిగా మారుతున్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మేలో ఎన్నికలు
శాసనమండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు జూన్‌లో ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.