తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ న్యూస్ @ 7AM - నేటి ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్
టాప్ న్యూస్

By

Published : Feb 13, 2022, 6:59 AM IST

  • అద్భుత ఘట్టం

ముచ్చింతల్‌లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీ రామానుజాచార్యుల సంపూర్ణ జీవితం నేడు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ప్రతిబింబించనుంది. 120 ఏళ్లు జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో తయారుచేసిన స్వర్ణమూర్తి ప్రతిమను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ లోకార్పణం చేయనున్నారు.

  • రాష్ట్ర గేట్‌వే

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో తెలంగాణ గేట్‌వే పేరిట భారీ ఐటీ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజైన ఈ నెల 17న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

  • ఇళ్ల స్థలాలకు టీఎస్‌ఐఐసీ భూములు

పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యం కాని TSIIC భూములను ఇళ్ల స్థలాలకు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరిశ్రమలు తరలించిన చోటా విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతోంది.

  • మేడారం రద్దీ

కోరిన కోర్కెలు తీర్చే కోటి వరాల కల్పవల్లులుగా... సమ్మక్క సారలమ్మలు ప్రసిద్ధి చెందారు. అందుకే వ్యయ ప్రయాసలు లెక్కచేయకుండా.... భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి... వనదేవతల్ని దర్శించుకుంటున్నారు.

  • 'మాఫియాలకు చెక్​ పెట్టేది భాజపానే'

అల్లరి మూకలు, మాఫియాలను భాజపా ప్రభుత్వం మాత్రమే కట్టడి చేయగలదని యూపీ ప్రజలు గుర్తించారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేసి ఓట్లను చీల్చాలని ప్రతిపక్ష నేతలు చూస్తున్నారని తెలిపారు.

  • 24 మంది సజీవ సమాధి!

ఉత్తర్​ప్రదేశ్ బులంద్​షహర్​లో ఘోర ప్రమాదం జరిగింది. శికార్పుర్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో 24 మంది కూలీలు సజీవ సమాధి అయ్యారు. పలువురు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • యుద్ధమేఘాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్​కు అమెరికా అధ్యక్షుడు బైడెన్​ వార్నింగ్​ ఇచ్చారు. ఉక్రెయిన్​పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు బైడెన్​. వీరి మధ్య దాదాపు గంట పాటు జరిగిన ఫోన్​ సంభాషణపై శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది.

  • విద్యుత్​ వాహనాలదే హవా!

దేశంలో విద్యుత్​, హైబ్రిడ్​ వాహనాలకు క్రమంగా డిమాండ్​ పెరుగుతోందని డెలాయిట్​ సంస్థ వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువ కావడం, వాతావరణ పరిరక్షణపై ఆలోచన, మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి వంటి కారణాలతో విద్యుత్‌ వాహనాలకు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది.

  • రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రభాస్ 'ప్రాజెక్టు కె'

ప్రభాస్ రామోజీ ఫిల్మ్​సిటీలో సందడి చేస్తున్నారు. 'ప్రాజెక్టు కె' షూటింగ్​లో కీలక సన్నివేశాల్ని పూర్తి చేస్తున్నారు.

  • అత్యధిక ధర పలికిన బౌలర్లు వీరే

ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. ఈ వేలంలో కొంతమంది బౌలర్లు మంచి ధర పలికారు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అతడిని రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details