1.కరోనా విముక్తి కోసం..
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. తెల్లవారుజామున చారిత్రక హిందూ దేవాలయాలను మోదీ సందర్శించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి యావత్ మానవజాతిని విముక్తం చేయాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిల్లీ ఎయిమ్స్‌కు రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. అయితే మరిన్ని పరీక్షల కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఈ జాగ్రత్తలు మరవద్దు..
రంగుల పండగ హోలీ అంటే... చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో రంగులాటకు సిద్ధమయ్యే ముందు కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేమిటంటే...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వలపు బాణమేసి...
‘‘మీ నగ్న వీడియోలు బాగున్నాయ్... స్నేహితులందరికీ పంపేద్దామా?.. లేక డబ్బులిస్తారా? అంటూ సైబర్ నేరస్థురాలు ఓ ఈవెంట్ మేనేజర్‌ను బెదిరించి రూ.10 లక్షలు కొల్లగొట్టింది. ఆపై డబ్బు డిమాండ్ చేస్తుండడంతో బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అది నేను కాదు
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహోళితో కలిసి అసభ్యకరమైన వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ.. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ మరో వీడియో విడుదల చేశారు. అంతకు ముందు ఆ మహిళకు సంబంధించిన ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.