1. చర్చలకు సిద్ధం
దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న సిక్కు రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు ప్రధాని మోదీ. సిక్కులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. రాజ్యసభలో మాట్లాడిన మోదీ.. కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థ ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. సభాముఖంగా రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మికులకు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆశా కిరణమైంది. ఒక్క ఫోన్ కాల్.. సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటపడేసింది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఐటీబీపీ టీం వీరిని రక్షించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. కిషన్ రెడ్డి లేఖ
ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. రికార్డు ధర
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు రికార్డు ధర వచ్చింది. మహదేవ్ అనే రైతు పంటను... పుల్లూరి నవీన్ ట్రేడర్స్ రూ.7111కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. భాజపాతోనే అభివృద్ధి
రాష్ట్రంలోని నిరుపేదల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్రభుత్వం కేటాయించిన.. బీసీల ఆత్మగౌరవ భవనాల స్థలాలను పరిశీలించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.