1.మొదటి స్థానం
'ఆత్మనిర్భర్' అమల్లో తెలంగాణకు మొదటిస్థానం లభించింది. కొవిడ్ సమయంలో ఉపాధి దెబ్బతినడం వల్ల వీధి వ్యాపారులకు సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.మరొకరు మృతి
వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమినేపల్లిలో ఇవాళ ఉదయం కొమురయ్య(90) మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.శరవేగంగా ఏర్పాట్లు
రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి కొవిడ్ టీకా పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. ఈనెల 16న టీకాల పంపిణీ ప్రారంభం రోజున 139 కేంద్రాలను ఎంపిక చేయగా.. అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 40, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 99 కేంద్రాలున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.కొత్తగా 224 కరోనా కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్‌తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.జేబుకు చిల్లే...!
ఏటీఎంలు వచ్చాక బ్యాంకు ఖాతాలో డబ్బులు తీసుకోవడం ఎంతో సులువయ్యింది. బ్యాంకుల్లో బారులు తీరే బాధ తప్పింది. కానీ ఇవే ఏటీఎంలను సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడానికి చక్కగా వాడేసుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.