తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@9M
టాప్​టెన్ న్యూస్@9PM

By

Published : Jun 22, 2020, 9:03 PM IST

నర్సాపూర్​ నుంచి ఆరో విడత హరితహారం

మెదక్ జిల్లా నర్సాపూర్​ నుంచి ఈనెల 25న ఆరో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్క నాటనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

వీరుడి కుటుంబానికి అండగా ఉంటాం

గల్వాన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

వీడిన మిస్టరీ

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం మృతి మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

విద్యుత్​ బిల్లులపై మీ వైఖరేంటి?

లాక్​డౌన్ వల్ల ప్రజలు ఆర్థిక వనరులు కోల్పోయినందున విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారించింది. లాక్​డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అవ్వ పెట్టిన బువ్వే

మా అవ్వ బంగారం... మా అవ్వ దగ్గరకు వెళ్తే అడిగింది చేసి పెడుతుంది.. అస్సలు కాదనదు అనుకుని మనవళ్లు అవ్వ ఇంటికి వెళ్లారు. అనుకున్నట్లుగానే వృద్ధురాలు తన మనవళ్లకు ఇష్టమైనవి చేసి పెడుతూ.. కొసరి.. కొసరి తినిపించాలనుంది. కానీ అదే ఆ ఇంట విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

పూరీ రథ యాత్ర షెడ్యూల్​

భక్తుల్లేకుండా రథయాత్రకు సుప్రీం అనుమతించిన నేపథ్యంలో పూరీ జగన్నాథ ఉత్సవం షెడ్యూల్​ను విడుదల చేసింది ఆలయ కమిటీ. తెల్లవారుజాము 3 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

తమిళనాడులో కరోనా పంజా

భారత్​లో కొవిడ్​-19 బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తమిళనాడులో ఒక్కరోజులోనే 2,710 మందికి వైరస్ సోకింది. మరణాల సంఖ్య 800 వందలకు చేరువలో ఉంది. కర్ణాటక, గుజరాత్​ల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

డ్రాగన్​పై గెలుపు సులువే!

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన చైనాను భారత్​ నిలువరించగలదా? డ్రాగన్​ దగ్గరున్న అధునాతన, శక్తిమంతమైన ఆయుధాల్ని ఎదుర్కోగలదా? యుద్ధం వస్తే ఎవరిది విజయం?... ఇప్పుడు అందరివే అనుమానాలు. సంఖ్యా బలం, ఆయుధ బలం ఎలా ఉన్నా... చైనా సైన్యంలోని లోపాలే ఆ దేశానికి శాపాలుగా మారతాయని అంటున్నారు నిపుణులు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో 'చక్ర'

విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'చక్ర'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ప్రాక్టీస్​ షురూ చేసిన నయావాల్​

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు టీమ్​ఇండియా నయావాల్​ ఛెతేశ్వర్​ పుజారా. సోమవారం తన స్వస్థలంలోని మైదానంలో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details