.సుధీర్ఘ భేటీ.. రాష్ట్రంలో లాక్డౌన్ ఈనెలాఖరు వరకు కొనసాగనుందా? కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కేబినేట్ భేటీలో పలు అంశాలపై చర్చ నడుస్తోంది. మద్యంపై ఆరా!రాష్ట్రవ్యాప్తంగా మద్యం నిల్వలపై ఆరా తీస్తోన్న ఆబ్కారీశాఖ. దుకాణాల వారీగా నిల్వలు పరిశీలించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున... రాష్ట్రంలోనూ అమ్మకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఒకవేళ దుకాణాలు తెరిస్తే మందుబాబులకు పండగే!పై తరగతికిఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అండగా ఉంటాంకరోనా కట్టడిలో, వలసకూలీలకు స్వగ్రామాలకు తరలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కూలీల ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులను తాము భరిస్తామన్నారు.ఆగని కరోనా ఏపీలో కరోనా కేసుల సంఖ్యకు పుల్‌స్టాప్ పడట్లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో 67 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూల్లో అత్యధిక కేసులు. జీ మెయిల్ లాక్ 'డౌన్'భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీ మెయిల్ సేవలకు అంతరాయం. పెద్ద సంఖ్యలో యూజర్లు జీమెయిల్లోకి లాగిన్ అవ్వడం వల్ల ఏర్పడిన సమస్య. దాదాపు 90 నిమిషాలకుపైగా సేవలకు ఆటంకం.జూలై 18 నుంచిజేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది కేంద్రం. జులై 18- 23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో అడ్వాన్స్డ్ పరీక్షలు, జులై 26న నీట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.నేరుగా డబ్బులిస్తేనే!కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని అభిప్రాయపడ్డారు నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ. రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.ఈ-మెయిల్ నామినేషన్లువివిధ క్రీడా పురస్కారాల నామినేషన్లను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర క్రీడల శాఖ. లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనాపై ర్యాప్ సాంగ్ధారావి ర్యాపర్స్ ఆధ్వర్యంలో, కరోనా అవగాహనపై చేసిన ఓ ర్యాప్ సాంగ్‌లో పలువురు బాలీవుడ్ స్టార్స్ భాగమయ్యారు. దీనిని త్వరలో విడుదల చేయనున్నారు.