తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

By

Published : Jun 13, 2020, 2:59 PM IST

Top ten news@3PM
టాప్​టెన్ న్యూస్​@3PM

గవర్నర్​కు విద్యార్థి లేఖ

వైద్య విద్య పీజీ పరీక్షలను పోస్టుపోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు ఓ వైద్యవిద్యార్థి లేఖ రాశాడు. ఇంకా ఆ లేఖలో ఏం రాశాడంటే!

చర్చా సమయం

జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులతో దేనిపై చర్చించనున్నారంటే..?

ఉత్తమ్​ ఫైర్​

ఎస్‌ఎల్‌బీసీ ఆరేళ్లయినా పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ పరిశీలన కోసం వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?

ఎర్రబెల్లికి గ్రీన్​ ఛాలెంజ్

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్​ వివిధ విత్తనాలతో లక్ష సీడ్​ బాల్స్​ తయారు చేసింది. ఒక్కటైనా ఎక్కువ తయారు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ వారెవరంటే!

ఏపీలో మరో 222

ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కూలిన 4 అంతస్తుల భవనం

బంగాల్ రాష్ట్రం మిద్నాపుర్​ జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి. మీరూ చూడండి.

వృద్ధులకు పెద్ద సవాలే

కరోనా కాలంలో ఇంటి బయట అడుగు పెట్టాలంటే వృద్ధులకు పెద్ద సవాలే. అలా అని ఇంట్లోనే ఉండటం చాలా కష్టమైన పని. కానీ తప్పదు. మరి వారు ఏం చేయాలి?

వసతి ఫ్రీ!

"టూర్​ ఖర్చులో కొంత భాగం మేమే భరిస్తాం... మీరు మా దేశానికి వస్తే చాలు" అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎందుకిలా? పూర్తి కథనం చదివేయండి.

ధోని ఆడాలి

ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్ తరఫున వికెట్​కీపర్​గా ధోనీ ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు పాక్​ క్రికెటర్​ కమ్రాన్​ అక్మల్​. దీనితో పాటే పలు విషయాల్నిపంచుకున్నాడు. లింక్ క్లిక్​ చేసి ఆ కథనాన్ని చదివేయండి.

హలో బాలీవుడ్

టాలీవుడ్​ స్టార్స్ కొందరు.. త్వరలో బాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. వారినీ తమ నటన కౌశలంతో మంత్రముగ్ధుల్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ వారెవరు? ఏయే ప్రాజెక్టులతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details