తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM - Top Ten News @ 3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News @ 3PM
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

By

Published : May 28, 2020, 2:57 PM IST

పరీక్షలు పెంచండి

కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోనే అతి తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నారని... ఇది సరి కాదంటూ వ్యాఖ్యానించారు. ఇంకా ఏం విమర్శించారంటే..?

కోర్టులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీ పురానీహావేలిలోని సిటీ సివిల్ కోర్టు క్యాంటీన్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణం ఏంటంటే?

తలసాని పెద్దమనసు​

కరోనా లాక్​డౌన్​ వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్​ నిలిచింది. దాదాపు 14 వేల మంది కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. పూర్తి కథనం కోసం..

22 మందికి అస్వస్థత

ఆదిలాబాద్‌ ఏజెన్సీలో కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. పూర్తి కథనం కోసం...

యాదాద్రిలో కళాఖండాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గర్భాలయ ముఖద్వార మండపంపై ప్రహ్లాదచరితం కనువిందు చేయనుంది. ఆలయం ఎలా ఉందో చూడాలంటే..!

వృద్ధి క్షీణత

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతం మేర క్షీణిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్​ అండ్ పీ అంచనా వేసింది. దీనికి కారణాలు ఏంటంటే..?

కారుబాంబు కుట్ర భగ్నం

కశ్మీర్​ పుల్వామాలో కారు బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం కీలక వివరాలు వెల్లడించారు పోలీసులు. ఈ ఉగ్రదాడికి జైషే మహమ్మద్​ కీలకంగా వ్యవహరించగా హిజ్బుల్ ముజాహిద్దీన్​ సాయం అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..?

పెరిగిన పేదరికం

కరోనా ప్రభావంతో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పేదరికం గణనీయంగా పెరగనుందని యునిసెఫ్​, సేవ్​ ది చిల్డ్రన్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా ఎన్ని కోట్ల మంది పిల్లలు పేదరికంలోమగ్గిపోనున్నారంటే..?

వాళ్లకు మతి చెడింది

టీమిండియా సీనియర్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ట్విట్టర్​లో పెద్ద చర్చే నడిచింది. ధోనిపై వచ్చిన వార్తలన్నీ పుకార్లే అంటూ కొట్టిపడేసింది ధోనీ భార్య సాక్షి సింగ్​.

డెలివరీ 'లేడీ'

తన కొత్త ఆల్బమ్​ 'క్రోమాటికా' హార్డ్​ కాపీలను పంచేందుకు కొత్త అవతారం ఎత్తింది అమెరికా పాప్​ గాయని​ లేడీ గాగా. ప్రత్యేక ట్రక్​లో డెలివరీ గర్ల్​గా వెళ్లి పంపిణీదారులకు కాపీలను అందజేసింది.పూర్తి కథనం కోసం...

ABOUT THE AUTHOR

...view details