తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​ @1pm - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు.

top ten news @1pm
టాప్​ టెన్​ న్యూస్​ @1pm

By

Published : May 12, 2020, 12:59 PM IST

  • రాత్రి 8 గంటలకు మోదీ ప్రసంగం

రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాలు.

  • క్యాన్సర్​కి తోడు కరోనా..

క్యాన్సర్‌ బాధితులకు కరోనా కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అవసరమైన చికిత్సలు ఆలస్యమవుతున్నాయనే ఆందోళన ఎంతోమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్యాన్సర్లు, కొవిడ్‌-19పై సమగ్ర కథనం.

  • అఖరి ప్రయాణం..

కాలినడకన సొంత రాష్ట్రానికి బయలుదేరిన వలస కార్మికుడు గమ్యానికి చేరుకోక ముందే వడదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు..

  • బీర్లు పొంగట్లేవ్​..

లాక్‌డౌన్‌ ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఎండాకాలంలో లిక్కర్‌ కంటే బీరు విక్రయాలు రెట్టింపుగా ఉండాల్సింది పోయి... ఇప్పుడు లిక్కర్‌ కంటే అమ్మకాలు తగ్గిపోతున్నాయి.

  • ఏపీలో మరో 33..

ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి వైరస్​ సోకిన వారి సంఖ్య 2051కి చేరింది. పూర్తి వివరాలు...

  • చైనా హెలికాఫ్టర్ల చక్కర్లు

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వద్ద.. చైనా సైనిక చాపర్లు చక్కర్లు కొట్టాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. సుఖోయ్​-30ఎమ్​కేఐను రంగంలోకి దింపింది. తర్వాత ఏం జరిగిందంటే?

  • వీసా ఉన్నా!

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తమ వద్ద వీసాలు ఉన్నా స్వదేశానికి రాలేకపోతున్నారు.కారణాలు ఇవే.

  • కరోనా భయాలు.. నష్టాల్లో మార్కెట్లు

కరోనా భయాలు, అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల స్టాక్​మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈక్విటీ బెంచ్​మార్క్​ సెన్సెక్స్ ప్రారంభ సెషన్​లో 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రేడింగ్​ సాగుతుందిలా..

  • టెన్నిస్​లో వారు.. క్రికెట్​లో వీరు

టెన్నిస్​లో రోజర్​ ఫెదరర్​, రఫెల్​ నాదల్​ ఎలాగో.. క్రికెట్​లో విరాట్​ కోహ్లీ, స్టీవ్​ స్మిత్​ అలా అని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​. పూర్తి కథనం

  • బోయపాటి.. ఘనాపాటి

టాలీవుడ్​లో మాస్​ సినిమాలకు కేరాఫ్​ అడ్రస్​ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం 'భద్ర' విడుదలై నేటికి 15 ఏళ్లు. ఈ సందర్భంగా బోయపాటి రూపొందించిన సినిమాలపై ప్రత్యేక కథనం.

ABOUT THE AUTHOR

...view details