ఈరోజు ఇప్పటివరకు జరిగిన ప్రధాన వార్తల సమాహారం మీ కోసం. ఆసక్తికర కథనాల లింక్స్‌ను క్లిక్ చేసి చదివేయండి.ధాన్యాగారం దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ ట్వీట్ నేపథ్యంలో మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిందంటే! తస్లీ 'మా'ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నంపెట్టి.. అమ్మైంది. పేదోళ్లకు చదువు చెప్పించి అక్కైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరం, ఆపద ఎక్కడ ఉంటే ఆమె అక్కడ ప్రత్యక్షమవుతోంది. ఆమె ఎవరంటే...కరోనాపై సమీక్షడీఎంహెచ్వోలతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షల నిర్వహణ, లాక్‌డౌన్‌పై చర్చిస్తున్నారు. భూలక్ష్మికి ఫోన్నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ భూలక్ష్మికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. 'బంధు' సాయంరైతుబంధుపై మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సమీక్షించారు. బ్యాంకర్లకు కీలక ఆదేశాలిచ్చారు. అవేంటంటే...'ఎల్జీ' ధర్నాఆంధ్రప్రదేశ్లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద వెంకటాపురం వాసులు ధర్నాకు దిగారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాల్సిందేని ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.ఆగని కరోనా ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ 43 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. మరణాల సంఖ్య 44కు చేరింది.బార్, పబ్బుకు ఓకే!బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతిచ్చింది కర్ణాటక ప్రభుత్వం. నేటి నుంచి 17వ తేదీ వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. పర్మిట్ రూంలకు అనుమతి లేదని స్పష్టం చెేసింది.టెస్టు, వన్డే ఒకేరోజుబీసీసీఐకి ఏర్పడిన ఆర్థికలోటును భర్తీ చేసేందుకు ఒకే రోజు రెండు ఫార్మాట్లలో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ విషయమై మాట్లాడిన బోర్డు అధికారి ఒకరు.. తమకున్న ఒకే ఒక ఆప్షన్ ఇదేనని చెప్పారు. మరిన్ని వివరాలు మీకోసం.సాయి పల్లవి నక్సలైటా?'విరాటపర్వం'లోని సాయిపల్లవి లుక్ ఆకట్టుకుంటూనే, పలు సందేహాలు రేపుతోంది. ఇందులో ఈమె నక్సలైట్‌గా కనిపించనుందని సమాచారం. ఈ రోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ లుక్‌ను మీరూ చూసేయండి.