తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

టాప్​న్యూస్ @7PM
టాప్​న్యూస్ @7PM

By

Published : Aug 8, 2022, 7:09 PM IST

  • హాకీలో భారత్ పసిడి​ ఆశలు ఆవిరి

Indian Hockey Team: కామన్​వెల్త్​ గేమ్స్​ హాకీలో అదరగొడుతుందనుకున్న టీమ్​ ఇండియా ఫైనల్లో చతికిలపడింది. ఆస్ట్రేలియా చేతిలో 7-0 తేడాతో చిత్తుగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. దీంతో.. 2022 కామన్వెల్త్​ క్రీడల్లో మొత్తం భారత్​ 61 పతకాలు సాధించింది. మొత్తం 22 స్వర్ణాలు ఉండగా.. 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

  • పార్లమెంటు నిరవధిక వాయిదా..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులు ముందే ముగిశాయి. లోక్​సభ, రాజ్యసభ సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుకు అనుకున్న ప్రకారం.. ఈనెల 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే.. అంతకన్నా ముందే ఉభయసభలు వాయిదా పడ్డాయి.

  • ఈనెల 28న కానిస్టేబుల్ రాత పరీక్ష

రాష్ట్రంలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీని మారుస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాల వల్ల తేదీని మార్చినట్లు నియామక బోర్డు వెల్లడించింది. ఆదివారం ఎస్సై రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

  • 'ఉచిత విద్య, వైద్యంపై ఎందుకీ వ్యతిరేకత?

Kejriwal news electricity : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 'ఉచితాల'నే ముద్ర వేసి, వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా విద్య, వైద్యం, 300 యూనిట్ల విద్యుత్, నిరుద్యోగ భృతిని అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

  • మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌: జీవన్‌రెడ్డి

Jeevan reddy On munugodu: మునుగోడు ఉప ఎన్నిక తమకు సెమీఫైనల్‌ లాంటిదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని సీటు నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతోనే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

  • తలైవా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్​ ఆర్​ఎన్ రవితో తలైవా 45 నిమిషాలకు పైగా సమావేశమవ్వడమే అందుకు కారణం. అయితే భేటీ అనంతరం రజినీ తన పొలిటికల్​ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

  • కామన్​వెల్త్ గేమ్స్ పతక విజేతలకు సీఎం అభినందనలు

CM KCR Wishes: కామన్​వెల్త్​ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన పీవీసింధు, బాక్సర్​ నిఖత్ జరీన్​కు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోసారి ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు సత్తా చాటారని ప్రశంసించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.

  • భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు..

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ఆఖరి రోజున స్వర్ణాల పంట పండుతోంది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్​లో లక్ష్యసేన్​, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ భారత్‌ మరో స్వర్ణం అందుకుంది. సాత్విక్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ.. సీన్‌-బెన్‌ ద్వయంపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు, టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్‌ విజయం సాధించాడు.

  • అమ్మ ఆ పని వద్దు అంది.. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది

ప్రతి క్షణం అమ్మను మిస్​ అవుతున్నా అని చెబుతోంది అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​. ఆమె లేని జీవితం చాలా కష్టంగా ఉందని అని అంటోంది. అయితే.. అమ్మ తనను సినిమా ఇండస్ట్రీలోకి వద్దని చెబినట్లు వివరించింది జాన్వీ.

  • రాజమౌళి చెప్పడం వల్లే ఎన్టీఆర్​తో అలా చేశా

విలక్షణ పాత్రలతోనే కాదు.. నటనతో ఎంతో ఆకట్టుకునే నటుడు రాజీవ్‌ కనకాల. విద్యార్థిగా, యువ నాయకునిగా ఎన్నో పాత్రలను పోషించారు. చూడగానే సొంతింటి మనిషి అన్నట్టుగా ఉండే రాజీవ్‌ దాదాపుగా 150 చిత్రాల్లో నటించారు. ఇప్పటికే మూడు దశాబ్దాల నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజీవ్‌ కనకాల ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. తన నటన, పాత్రల తీరు, పరిశ్రమతో అనుబంధాన్ని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details