తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @11AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 20, 2022, 10:59 AM IST

  • ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి..?

KTR Tweet Today : తరచూ ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్‌ విధానాలు, ప్రధాని మోదీపై విరుచుకుపడే రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి వారిపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను ట్వీట్ చేశారు. ఇంతకీ అవేంటంటే..?

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 20,557 మంది వైరస్​ బారినపడగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,517 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది.

  • వాహనంతో ఢీకొట్టి మహిళా ఎస్సై హత్య

హరియాణాలో డీఎస్​పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్​లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.

  • ప్రేమ పేరుతో యువకుడి మోసం..

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఓ యువకుడిని యువతి చితకబాదింది. దుగ్దాకు చెందిన ఓ యువకుడు.. మతం మార్చుకుని అమాయక యువతులను మోసం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ బాధిత యువతి.. యువకుడిని తీవ్రంగా కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

  • లోన్‌యాప్ వేధింపులు.. 9 మంది అదృశ్యం

loan App agents harassment : వేధింపులు తాళలేక హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో రెండు రోజుల్లో రుణయాప్‌ల బాధితుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వేర్వేరు ఠాణాల్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేశారు.

  • వరదతో వచ్చి బురదలో చిక్కుకున్న మొసలి

Godavari Flood Effect : మహోగ్రరూపం చూపిన గోదావరి శాంతించడంతో భద్రాద్రి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరదతో పాటు పాములు, తేళ్లు, మొసళ్లు ఇళ్లు, పొలాల్లోకి చేరాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామం పంట పొలంలో మొసలి పిల్ల సంచారం కలకలం రేపింది. పొలంలో బురదలో చిక్కుకున్న మొసలి పిల్లను జంతు సంరక్షణ అధికారులు బయటకు తీశారు. అనంతరం హైదరాబాద్ జూపార్కుకు తరలించారు.

  • కొత్తగా 658 మందికి కొవిడ్.. హైదరాబాద్‌లో 316

Telangana Corona Cases Today : కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రాష్ట్రంలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 658 కొవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,10,976కు చేరినట్లు తెలిపింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 316 పాజిటివ్‌లు నిర్ధారణ అయినట్లు పేర్కొంది.

  • వరద గరిష్ఠంగా వెళ్లిన జులై ఇదే కానుందా!

గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద ఈ ఏడాదే అత్యధికం కానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జులైలో గోదావరి నుంచి సముద్రంలోకి 100 నుంచి 500 టీఎంసీలు మాత్రమే వెళ్లేది. ఇంతకు మించి వెళ్లిన సంవత్సరాలు చాలా తక్కువ. కానీ, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 'మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తా..'

నవతరానికి ప్రతిబింబంలా కనిపిస్తుంటారు... నాగచైతన్య. మనలో ఒకడిలా కనిపించే ఆయన ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలతో కట్టిపడేస్తుంటారు. జీవితాలకి దగ్గరగా ఉండే కథలతో ప్రయాణం చేస్తున్న నాగచైతన్య ఇటీవల 'థ్యాంక్‌ యూ' చేశారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్య మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

  • యమలీల 'సుజాత' ట్రెండింగ్​

అందం, నటన, క్యూట్​ స్మైల్​, మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది నటి సోనియా సింగ్​. 'హే పిల్ల', 'రౌడీ బేబీ', 'సాఫ్ట్​వేర్​ సావిత్రి', 'ఓయ్​ పద్మావతి' ఇలా ఎన్నో సిరీస్​లతో ఆకట్టుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'యమలీల' సీరియల్​లో చిన్ని పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు ప్రస్తుతం 'అలా సుజాత దరికి చేరిన సుబ్రమణ్యం' అనే వెబ్​సిరీస్​ చేస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్​మీడియాలో సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఓ సారి ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోషూట్​ సహా కొన్ని విశేషాలను తెలుసుకుందాం..

ABOUT THE AUTHOR

...view details