తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @ 11AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
టాప్​న్యూస్ @ 11AM

By

Published : Jul 18, 2022, 11:00 AM IST

  • 'రాష్ట్రపతి ఎన్నిక' పోలింగ్​ షురూ..

ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగే దేశ ప్రథమ పౌరుడి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,800 మంది కాగా మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. అటు ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పా‌ట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. పోలింగ్‌ సామగ్రిని పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ముందే తరలించింది.

  • పేలిన గ్రనేడ్​.. ఆర్మీ కెప్టెన్ దుర్మరణం

జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్రనేడ్​ పేలగా.. ఆర్మీ కెప్టెన్​, జేసీఓ(జూనియర్​ కమిషన్డ్​ ఆఫీసర్​) దుర్మరణం చెందారు. నియంత్రణ రేఖ వెంబడి మేంఢర్​ సెక్టార్​ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

  • స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే 3,500 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,935 మంది వైరస్​ బారినపడగా.. మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,069 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.

  • ఉద్యమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కేసీఆర్‌

గోదావరి వరద ధాటికి ఛిద్రమైన పలు ప్రాంతాల్లో ఆదివారం ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించారు. హనుమకొండ నుంచి భద్రాచలం వరకు అనేకచోట్ల రహదారిపై పొంగిపొర్లే వరదలో నుంచే కేసీఆర్‌ బస్సు ప్రయాణం సాగింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ పెద్ద చెరువు వద్దకు రాగానే తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్ నెమరువేసుకున్నారు.

  • వీరి వ్యవహారం.. వివాదాస్పదం.. !!

జిల్లాలో పలువురు పోలీస్‌ ఠాణాల అధికారుల పనితీరు వివాదాస్పదమవుతోంది. స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా, కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి కారణంగా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారుల ప్రవర్తన చర్చనీయాంశమవుతుంది.

  • నెమ్మదిస్తున్న గోదావరి.. కొనసాగుతున్న కృష్ణా ప్రవాహం..

గోదావరికి క్రమేణా వరద తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలో ఎగువన ప్రవాహం తగ్గి భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 58.5 అడుగులు ఉండగా, 17.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

  • ఈమె కేసీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్...: కేటీఆర్

'తెరాసకు, కేసీఆర్‌కు వీరాభిమాని, నాకు గట్టి మద్దతుదారు ఈ జిందం సత్తమ్మ' అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ పోస్టు పెట్టారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన సత్తమ్మ సీఎం కేసీఆర్‌ హార్డ్‌కోర్‌ అభిమాని అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక భాగస్వామ్యమని, సిరిసిల్ల నియోజకవర్గంలో నాకు గట్టి మద్దతుదారు కూడా అంటూ మంత్రి కేటీఆర్‌ ఆదివారం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో సత్తమ్మ గురించి రాశారు. ఆమెతో ఉద్యమ సమయంలో, మంత్రిగా వివిధ సందర్భాల్లో కలిసిన ఫొటోలను ఉంచారు.

  • సైనికులపై ఆంగ్లేయుల వివక్ష..

ఆంగ్లేయుల పాలనలోకి వచ్చాక భారతీయ సైనికులు రెండు ప్రపంచ యుద్ధాలే కాదు.. ప్రపంచంలో బ్రిటన్‌ పాల్గొన్న ప్రతి యుద్ధంలోనూ ఆ దేశం తరఫున పోరాడారు. వీరి దన్నుతో బ్రిటన్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని, నిలబెట్టుకుంది. ఇంత చేసినా భారతీయ సైనికులకు కనీసం గుర్తింపు, హోదా ఇవ్వటానికి నిరాకరించింది. సరైన శిక్షణ ఇవ్వటానికి సైతం అంగీకరించలేదు.

  • సామాన్యుడిపై భారం.. జీఎస్​టీ రేట్లు పెంపు..

GST rate hike: పెట్రోల్‌, డీజిల్‌ సహా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. జూన్‌ 28, 29న చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు నేటి నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీని ప్రకారం ఏయే వస్తువులు, సేవలు భారం కానున్నాయంటే..

  • భారత ఖ్యాతిని చాటిన ప్రియాంక చోప్రా

Happy birthday: దేశం గర్వించదగ్గ తారల్లో ప్రియాంక చోప్రా ఒకరు. బాలీవుడ్​ నుంచి.. హాలీవుడ్​కు వెళ్లి.. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభను చాటుతున్నారు. హాలీవుడ్​లో సినిమాలు చేస్తున్న ఆమె దేశానికి ఏం చేసిందని విమర్శించే వాళ్లూ ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తన గ్లామర్​ కెరీర్​లో భారతదేశం గర్వపడేలా చేసిన క్షణాలు కూడా ఉన్నాయి. సోమవారం (జులై 18) ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె సాధించిన అరుదైన ఘనతలు మీ కోసం..

ABOUT THE AUTHOR

...view details