తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ 7AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7am topnews
7am topnews

By

Published : Sep 18, 2022, 6:57 AM IST

  • ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope: సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 24 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

  • మరోమారు చర్చనీయాంశంగా గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం

గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది.

  • వివాదాల్లో ఎస్పీలు.. ఐపీఎస్​లను నియమించకపోవడమే కారణమా..?

రాష్ట్రంలో రెగ్యులర్‌ అధికారులను కాదని పదోన్నతులు పొందిన అధికారులకు ఎస్పీ బాధ్యతలు అప్పగించడంతో, వారు తరచూ వివాదాల్లో చిక్కుకోవడంతో పెద్ద సమస్యగా మారింది. తాజాగా సూర్యాపేటలో జరిగిన సంఘటన దీనికి ఊతమిస్తోంది.

  • 'రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వల్లే దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోతుంది'

కేంద్రానిది సహకార సమాఖ్య కాదు.. బలవంతపు సమాఖ్య అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలన్న ఆయన.. కేంద్రం పెత్తనం ఉండరాదని మండిపడ్డారు.

  • ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణం

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మొదట పిల్లలకు ఉరివేసి చంపిన తల్లి తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి ధనలక్ష్మి, పిల్లలు సమన్విత (6), శంకరమ్మ ‍‌(6 నెలలు)గా పోలీసులు గుర్తించారు.

  • 'సూపర్​ పవర్​గా భారత్.. ప్రపంచ మార్కెట్​ను ఆక్రమించేలా దేశీయ వ్యవస్థలు!'

దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

  • వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం

పొరుగు దేశం నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుదర్‌పశ్చిమ్‌ , అచ్ఛం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం చెందారు.

  • RTO ఆఫీస్​కు వెళ్లే పనిలేదు..

వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సహా 58 పౌర సంబంధిత సేవలు ఆధార్‌ అథంటికేషన్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

  • క్రికెట్​లోకి ఉసేన్​ బోల్డ్​ ఎంట్రీ.. భారత్​లోనే మ్యాచ్​

జమైకా చిరుత ఉసేన్​ బోల్ట్​ అందరికీ సుపరిచతమే. ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే అథ్లెట్‌గా రిటైర్‌ అయిన బోల్ట్‌ త్వరలోనే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ఓ ప్రతిష్టాత్మక లీగ్‌లో ఉసేన్‌ ఆడనున్నాడు. విశేషం ఏమిటంటే.. అతడు క్రికెట్‌ ఆడేది ఇండియాలోనే.

  • ఒక్క తెలుగు సినిమాతో స్టార్​ హీరోయిన్​గా​.. ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా?

తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమా. కానీ పేరు, ఫేమ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్​లో సంపాదించింది. కుర్రాళ్లయితే ఆమెపై మనసు పారేసుకున్నారు. తన రూపాన్ని గుండెల్లో దాచేసుకున్నారు. ఈ మధ్య ఆమె.. పెళ్లి-పిల్లలు గురించి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగా వైరల్ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details