తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 11AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ 11AM
టాప్​న్యూస్ 11AM

By

Published : Aug 30, 2022, 10:56 AM IST

  • దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు

దేశంలో సోమవారం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 5,439 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ఉన్నందున కేవలం ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

  • పెళ్లైన తొమ్మిది రోజులకే విషాదం

ఒక్కగానొక్క కొడుకు. పెళ్లైన 20 ఏళ్లకు కలిగిన సంతానం. ఇటీవల కుమారుడికి పెళ్లి చేసి తమ బాధ్యతను తీర్చుకున్నారు ఆ వృద్ధ తల్లిదండ్రులు. తమకు కొడుకు, కోడలు ఆసరాగా ఉంటారని భావించారు. కానీ ఆ కలలు ఎంతో కాలం నిలువలేదు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు ప్రాణాలను విడిచాడు. కోడలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • ప్రభుత్వాస్పత్రి ఘటనలో 4కు చేరిన మృతులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు మరణించగా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక అనే మరో ఇద్దరు కన్నుమూశారు.

  • బలవంతంగా బీఫ్ తినిపించిన భార్య

బలవంతంగా భార్య, బావమరిది కలిసి బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల ర్యాంకుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మాత్రమే అదానీ కంటే ముందున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. వీరి సంపద ఎంతంటే

  • నిరసనకారులపై కాల్పులు, 20 మంది మృతి

ఇరాక్​లో కాల్పులు కలకలం రేపాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. మరో 100 మంది గాయపడ్డారు. ప్రముఖ షియా మత గురువు ముక్తాదా అల్ సదర్ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం

శృంగారమంటే ఆనందం, సంతోషం, ఉత్సాహాన్ని కలిగించటమే కాదు ఆరోగ్య సంబంధాల మీదా గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. శృంగార లేమితో రక్తపోటు పెరుగుతుంది, నిద్ర అస్తవ్యస్తమవుతుంది, మతిమరుపూ వస్తుంది. మరి శృంగారంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.

  • టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్‌

టీమ్​ఇండియా అభిమానులకు గుడ్​ న్యూస్​. గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్​కు దూరమైన స్టార్​ పేసర్​ కోలుకున్నట్లు తెలిసింది. టీ20 ప్రపంచకప్​లో కచ్చితంగా అతడు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

  • కన్నీళ్లు పెట్టుకున్న రష్మి

యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న రష్మి చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా తన లవ్​ఫెయిల్యూర్​ విషయాన్ని తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details