తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్​టెన్​ న్యూస్​@9AM

By

Published : May 11, 2021, 8:58 AM IST

సర్కారు కీలక నిర్ణయం!

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో లాక్​డౌన్​పై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం భేటీ కానున్న కేబినెట్... లాక్​డౌన్ విధించే అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చిన్నారులకు కరోనా ముప్పు

కరోనా మహమ్మారి దక్షిణాదిలో మే ఆఖరుకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని... ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ వి.రవి తెలిపారు. మొదటిదశలో 4 శాతం మంది పిల్లలే కొవిడ్​ బారిన పడ్డారని... ప్రస్తుతం అది 15 నుంచి 20 శాతం ఉందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేడు అత్యవసర విచారణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈనెల 5న విచారణ జరిపిన హైకోర్టు.. పలు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది మృతి

అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆస్పత్రిలో..ఒక్కసారిగా అలజడి రేగింది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. యంత్రాలు హెచ్చరించడం మొదలుపెట్టాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొత్త ఆయుధాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. దైనందిన జీవితాల్లో డిజిటల్​ చెల్లింపులతో మొదలుకుని టెలీవైద్యం, వర్చువల్​ సమావేశాలు, డ్రోన్ల వినియోగం వంటివి పెరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇదీ మూల్యం!

కొవిడ్​ సంక్షోభంతో భారత్​లో కొరవడిన వైద్యసేవలు, స్వాస్థ్య వ్యవస్థ పరిమితులు బట్టబయలయ్యాయి. 2021-22 వార్షిక బడ్జెట్‌లో తమకు సుమారు లక్షా 21వేల కోట్ల రూపాయలు అనుగ్రహించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కోరినా.. అందులో రూ.50వేల కోట్లు కోతపెట్టినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికాంశాలే చాటుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లింకు తెరిస్తే అంతే!

కొవిడ్ వ్యాక్సిన్​కు సంబంధించి ఆండ్రాయిడ్ సాఫ్ట్​వేర్​ ఆధారంగా పనిచేసే స్మార్ట్​ఫోన్లకు నకిలీ మెసేజ్​లు వస్తున్నాయని నిఘా అధికారులు గుర్తించారు. వాటి ద్వారా ఫోన్లలోని డేటాను సైబర్​ నేరగాళ్లు కాజేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెట్రో బాదుడు

దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటరుకు 24 నుంచి 32 పైసలు వరకు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రియల్​ లైఫ్​ హీరోలు

కష్టమన్న మాట వినిపించిన ప్రతిసారీ కన్నీళ్లు తుడిచేందుకు మేమున్నామంటూ ముందుకొస్తుంటారు సినీ ప్రముఖులు. తమ వంతు సాయమందించి ఆపన్నులకు అండగా నిలుస్తుంటారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఐపీఎల్‌ మ్యాచ్​లు భారత్‌లో జరగవు

కొవిడ్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్​ మిగతా మ్యాచ్​లు భారత్​లో జరగవని స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మ్యాచ్​లకు నిర్వహణ పరమైన అడ్డంకులు ఉన్నాయని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details