హుజూర్నగర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. అగ్రనేతల దృష్ట్టంతా... ఇప్పుడు ఉప ఎన్నికలపైనే ఉంటోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తెజస అధ్యక్షుడు కోదండరామ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తే... సతీమణితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్నగర్ మండలంలో ఓటర్లను కలుసుకున్నారు.
తెరాసపై కోదాండరామ్ విమర్శలు...
గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు కోల్పోవటం వల్ల... తెరాసలో అంతర్మథనం మొదలైందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అది పునరావృతమైతే... ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
ప్రచార బరిలో అగ్రనేతలు...
తెరాస ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జగదీశ్‌రెడ్డి... సైదిరెడ్డిని గెలిపించాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. లీడర్‌ను, కేడర్‌ను సమన్వయం చేయటమే ఇంఛార్జిల కర్తవ్యమన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం... పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి కిరణ్మయిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తన సతీమణి పద్మావతిని గెలిపించాలంటూ ఉత్తమ్... పలు గ్రామాల్లో పర్యటించారు. తనను గెలిపిస్తే రూ. వంద కోట్లతో హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తానంటూ... భాజపా అభ్యర్థి రామారావు హామీ ఇస్తున్నారు. ఇలా ముఖ్య నేతల రాక, అభ్యర్థుల పర్యటనలతో... హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
జోరందుకున్న ప్రచారం... రంగంలోకి అగ్రనేతలు ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!