రాష్ట్రంలో ఇవాళ, రేపు ఈదురుగాలులు, వడగండ్లతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల వడగండ్లతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇవాళ, రేపు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు - తెలంగాణలో వర్షసూచన
ఇవాళ, రేపు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
ఇవాళ, రేపు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు
రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:అకాల వర్షం: ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం