తెలంగాణ

telangana

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఇవాళ వర్షాలు

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 15న తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు పేర్కొంది.

By

Published : Oct 11, 2021, 1:49 PM IST

Published : Oct 11, 2021, 1:49 PM IST

Updated : Oct 11, 2021, 2:44 PM IST

Weather Report
Weather Report

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి సుమారు ఈ నెల 15న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దక్షిణ ఒడిస్సా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశాలున్నాయని సంచాలకులు వివరించారు.

Last Updated : Oct 11, 2021, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details