తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన - Today TRS MLC Candidates revels

త్వరలో వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను తెరాస ఇవాళ ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపికపై శనివారం రోజు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మూడు జిల్లాల మంత్రులతో చర్చించారు. ఇవాళ తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

By

Published : May 12, 2019, 6:36 AM IST

Updated : May 12, 2019, 7:19 AM IST

నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మూడు జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్​ రెడ్డి, మల్లారెడ్డిలతో శనివారం తన నివాసంలో సమావేశమై చర్చించారు. రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి శ్రీనివాస్ రెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించారు. నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు చర్చకు వచ్చినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయంగా ఇతర నేతలు తేరా చిన్నప రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, చకిలం అనిల్ కుమార్, సుంకరి మల్లేశ్ గౌడ్, వై.వెంకటేశ్వర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని యోచించినట్లు తెలిసింది. ఈ రోజు నల్గొండపై తుది నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్​కు అప్పగించారు.

Last Updated : May 12, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details