సంక్రాంతి సెలవుల అనంతరం నేడు పునఃప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక విచారణ జరగనుంది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టును ఏపీ ఎస్ఈసీ ఆశ్రయించగా... ఆ పిటిషన్‌పై నేడు ధర్మాసనం విచారణ జరపనుంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఈనెల 18 వరకు అమల్లో ఉంటే అభ్యర్థులు, ఓటర్ల ఆలోచనల్లో గందరగోళం తలెత్తుందని... గత విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయడం వల్ల... ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నిలిచిపోతుందని తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడం వల్ల ఎన్నికల సన్నద్ధత మరింత కష్టంగా మారుతుందని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు ఎస్ఈసీ తరుఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.
ఏపీ పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ - తెలంగాణ వార్తలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై నేడు ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం... ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది.
ఏపీ ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్... విచారణ వాయిదా వేయడం వల్ల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులేమీ ఉండవన్నారు. గతేడాది మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ విడుదల చేసిందని... అప్పటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సైతం ప్రచురితమైందన్నారు. ఈనెల 22కల్లా ఓటర్ల జాబితాను ఎస్‌ఈసీ ముందుంచే బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఓటర్ల జాబితా ప్రచురణకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ఏపీ న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ విషయాన్ని నేడు జరిగే విచారణలో కోర్టు దృష్టికి తీసుకురావాల్సిందిగా ఎస్ఈసీకి సూచించింది.
ఇదీ చదవండి:రైతుల 'రిపబ్లిక్ డే' ర్యాలీపై నేడు సుప్రీం విచారణ
TAGGED:
AP Panchayat election news