కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రక్రియలో భాగంగా భవనం కోసం బోర్డు యాజమాన్యం అన్వేషణ చేస్తోంది. ఈ మేరకు మంగళవారం నుంచి శుక్రవారం వరకు ముగ్గురు సభ్యుల బృందం విశాఖపట్నంలో పర్యటించి అనువైన అద్దె భవనాలను పరిశీలించనుంది.
నేటి నుంచి విశాఖలో కృష్ణా బోర్డు సభ్యుల పర్యటన - ap latest news
కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం ఇవాళ్టి నుంచి విశాఖలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ప్రధాన కార్యాలయ వసతి భవనాలను పరిశీలించనుంది.
నేటి నుంచి విశాఖలో కృష్ణా బోర్డు సభ్యుల పర్యటన
బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా, కార్యదర్శి డీఎం రాయ్‌పురే, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.వేణుగోపాల్ ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సహకరించాలని కోరుతూ బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా.. ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌నకు లేఖ రాశారు. ఈ నెల మొదటి వారంలో బోర్డు అధికారులు కొందరు విశాఖపట్నంలో పర్యటించి వచ్చారు.
- ఇదీ చదవండి :తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు