TS Corona Cases: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - corona news
22:29 February 10
తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు.. ఇద్దరి మృతి
TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 58,749 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,81,603కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,105కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,861 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి:హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు