తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు అంత్యక్రియలు - PREMONMADI

వారం రోజులుగా మృత్యువుతో పోరాడి రవళి ఓడిపోయింది. రాత్రి యశోదా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నేడు వరంగల్​లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నేడు అంత్యక్రియలు

By

Published : Mar 5, 2019, 11:24 AM IST

Updated : Mar 5, 2019, 11:37 AM IST

నేడు అంత్యక్రియలు
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి నిన్న మృతి చెందింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష నిమిత్తం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మొదటి నుంచి రవళి ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. రాష్ర్టంలో మరే ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకుండా నిందితుడైన సాయి అన్వేష్​పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా నిలబడతామని వెల్లడించారు.

కేసు దర్యాప్తు కోసం వరంగల్ పోలీసులు గాంధీకి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం రవళి మృతదేహాన్ని వరంగల్ జిల్లా రామచంద్రపురం గ్రామానికి తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Last Updated : Mar 5, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details