రాష్ట్రవ్యాప్తంగా శిశు మరణాలు తగ్గించేందుకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగవ్వాలి : గవర్నర్ - హైదరాబాద్ తాజా సమాచారం
రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణ కోసం మరిన్ని వైద్య సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. రాజ్భవన్లో జరిగిన సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ కార్యక్రమంలో మూడు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను పంపిణీ చేశారు.
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగవ్వాలి : గవర్నర్
రాజ్భవన్లో సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ (సీఎస్ఐఆర్) కార్యక్రమంలో నీలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్, డిస్పెన్సరీకి ఒక్కో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగుల వద్దకే వెళ్లి పరీక్షించేలా పరికరాలు తయారవుతున్నట్లు దాతలు వెల్లడించారు. తాను వైద్యురాలిగా పనిచేసే సమయంలో కేవలం వంద రూపాయలకే స్కానింగ్ చేసినట్లు గవర్నర్ గుర్తు చేసుకున్నారు.