తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్​ఆర్​సీ కంటే ముందు మోదీ డిగ్రీ పట్టా చూపించాలి'

దేశ ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏ, ఎన్​ఆర్​సీ లాంటి బిల్లులను తెరపైకి తెచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ గోయెల్‌ మండిపడ్డారు. దేశ ప్రజల జన్మ పత్రాలను చూపించమంటున్న మోదీ.. ఆయన డిగ్రీ పట్టాలను మాత్రం చూపించరని ఎద్దేవా చేశారు.

దేశం ఆర్థికంగా పతనమవుతుంటే... సీఏఏ, ఎన్​ఆర్​సీ తెచ్చారు : శక్తి సింగ్
దేశం ఆర్థికంగా పతనమవుతుంటే... సీఏఏ, ఎన్​ఆర్​సీ తెచ్చారు : శక్తి సింగ్

By

Published : Dec 26, 2019, 5:11 PM IST

Updated : Dec 26, 2019, 7:20 PM IST

ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ గోయెల్‌ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండేదన్నారు. యూపీఏ హయాంలో ప్రపంచ అయిదు దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగిందని పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా పతనమవుతుంటే... ప్రజల దృష్టి మళ్లించడానికే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.

దేశమంతటిని అస్సాం చేస్తారా ?

అస్సాంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుకు కేంద్రం సిద్ధమవుతోందని మండిపడ్డారు. మోదీ తన డిగ్రీ పట్టాలను చూపించేందుకు ముందుకు రారని... కానీ దేశ ప్రజలను మాత్రం తమ జన్మ హక్కు పత్రం చూపించమంటున్నారని మండిపడ్డారు.

దేశం ఆర్థికంగా పతనమవుతుంటే... సీఏఏ, ఎన్​ఆర్​సీ తెచ్చారు : శక్తి సింగ్

ఇవీ చూడండి : ' కేసీఆర్​కు మున్సిపల్​ ఎన్నికల భయం పట్టుకుంది'

Last Updated : Dec 26, 2019, 7:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details