తెలంగాణ

telangana

ETV Bharat / state

Tngos Meet CS: అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి: టీఎన్జీవోలు - టీఎన్జీవో సంఘం నేతలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సోమేశ్‌కుమార్‌ని టీఎన్జీవో సంఘం నేతలు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 4 డీఏలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని టీఎన్జీవోలు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని సీఎస్‌ వారికి హామీ ఇచ్చారు.

TNGOS meet CS Somesh kumar in secretariat in hyderabad
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సోమేశ్‌కుమార్‌

By

Published : Oct 29, 2021, 4:49 AM IST

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేశ్‌కుమార్‌ని టీఎన్జీవో సంఘం నేతలు కోరారు. హైదరాబాద్​లోని సచివాలయంలో సీఎస్‌ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు విడతల కరవు భత్యం(డీఏ) మంజూరు చేయడం సహా మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీం అమలుకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేయాలన్నారు. ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ సచివాలయంలో సీఎస్​ను కలిసి అభ్యర్ధించారు.

ఉద్యోగులకు మినహాయింపుల కోసం గతంలో మాదిరిగా రాష్ట్రస్థాయిలో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొన్నిశాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో శాఖాధిపతుల జాప్యాన్ని నివారించాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ను ఉద్యోగ సంఘాల నేతలు అభ్యర్ధించారు. సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హమీ ఇచ్చినట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details