మంత్రి కేటీఆర్‌ను టీఎన్జీవో నూతన అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగా టీఎన్జీవో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్ మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.
టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ - కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసిన మామిళ్ల రాజేందర్
రాష్ట్రంలో నూతనంగా టీఎన్జీవో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
మామిళ్ల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రస్తుతం ఆయన బాధ్యత పెరిగిందని..ఉద్యోగులు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలన్నారు. ప్రసుత్త పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'