తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో - minister eetala rajender latest news

కొవిడ్ బారిన పడిన ఉద్యోగులందరికీ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్య సదుపాయం కల్పించాలని టీఎన్జీవో సంఘం కోరింది. ఈ మేరకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిశారు.

tngo leaders met with helth minister eetala rajender in hyderabad
ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో

By

Published : Sep 5, 2020, 7:57 PM IST

టీఎన్జీవో రాష్ట్ర సంఘం 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిశారు. తెలంగాణలో కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు.

కరోనాతో చనిపోయిన ఉద్యోగులందరికీ 50 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని... కొవిడ్ బారిన పడ్డ ఉద్యోగులకు నెలరోజుల ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలన సూచించారు. సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details