పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు కోరారు. బదిలీలు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అసిస్టెంట్, కార్యదర్శులకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. జనాభా, ఆదాయం ప్రాతిపదికన గ్రామ పంచాయతీల గ్రేడుల వర్గీకరణ, మహిళ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు.
Errabelli Dayakar Rao: 'పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి' - తెలంగాణ వార్తలు
పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు కోరారు. మహిళ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఎన్డీవో సంఘం
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారని టీఎన్జీవో నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైకోర్టులో మమత పిటిషన్ విచారణ వాయిదా