తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ విద్యా విధానంలో మార్పు రావాలి' - జాతీయ విద్యావిధానం

జాతీయ విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​ సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు.

తెజస అధ్యక్షుడు

By

Published : Aug 8, 2019, 8:22 PM IST

ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​లోని సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​లో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. మనం ఏది నేర్చుకున్నా అది భారత రాజ్యాంగంలోని సూత్రాల ప్రమాణంలో ఉండాల్సిందే తప్ప వేరేది ఉండకూడదని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలోని నిబంధనలకు అనుగుణంగా నైపుణ్యాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థి, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

'జాతీయ విద్యా విధానంలో మార్పు రావాలి'

ABOUT THE AUTHOR

...view details